ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని జడ్.మేడపాడు గ్రామ మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ... ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చేది విద్య అని అన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలలను కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివఅద్ధి, విద్యార్థుల ఆరోగ్యం కోసం పోషక విలువలతో కూడిన ఆహారం, అమ్మ ఒడి, జగనన్న ఆణిముత్యాలు వంటి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వడ్డి రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.