Jan 20,2023 20:53

న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) ఁకర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో భారీ వృద్థి ఉండకపోవచ్చఁ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థాయిలో పన్ను వసూళ్లలో పెరుగుదల కొనసాగించడం కష్టమఁ భావిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నులను కలిపి ప్రత్యక్ష పన్నులుగా పరిగణిస్తారు. ఓ వైపు దేశంలో కార్పొరేట్ల ఆస్తులు ప్రపంచంలో ఎక్కడా లేఁ విధంగా పెరుగుతున్న వేళ పన్ను వసూళ్లలోనూ తగ్గుదల చోటు చేసుకోవచ్చనే రిపోర్టులు ఆర్థిక వ్యవస్థకఁ ఆందోళన కలిగించే అంశమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 10 నాటికి ఁకర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.55 శాతం వద్ధితో రూ.12.31 లక్షల కోట్లకఁ చేరాయి. ఇది బడ్జెట్‌ అంచనాల్లో 88.68 శాతాఁకి సమానం.