Apr 04,2023 10:46

చెన్నై : సోమవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌ 12 పరుగుల తేడాతో ఓడించిన సంగతి విదితమే. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు వైడ్స్‌, నోబాల్స్‌ చాలా వేశారు. వాటిని కట్టడి చేసుంటే చెన్నై మరింత తేడాతో గెలిచేది. ఈ విషయమై చెన్నై బౌలర్లను ధోనీ హెచ్చరించారు. మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ ... '' మా పేసర్లు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్‌ చేయడం నేర్చుకోవాలి. ముఖ్యంగా నోబాల్స్‌, వైడ్స్‌ వేయడం పూర్తిగా మానుకోవాలి. లేదంటే వాళ్లు వేరే కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుంది '' అని హెచ్చరించారు.