2011లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు వరల్డ్ కప్ గెలిచి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంబరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దోనీని గౌరవించాలని ముంబై క్రికెట్ సంఘం నిర్ణయించింది. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. శ్రీలంకతో ఫైనల్‌లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ వెల్లడించారు. పేరు ఆవిష్కరణ కార్యక్రమం కోసం ధోనీని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్, గవాస్కర్, విజరు మర్చంట్ పేర్లు ఉన్నాయి. కొన్ని గేట్లకు ఉమ్రిగర్, వినూ మన్కడ్ పేర్లు పెట్టారు. ఇప్పుడు వినూత్నంగా సీటుకు ధోని పేరు పెడుతున్నారు.










