May 30,2023 21:09
  • ఐపిఎల్‌ టైటిల్‌ను ఐదోసారి ముద్దాడిన తలైవా

అహ్మదాబాద్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై స్పందించాడు. తాను ఫిట్‌గా ఉన్నంతకాలం ఐపిఎల్‌లో ఆడతానని, ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచనే తన మదిలో లేదని చెప్పుకొచ్చాడు. సోమవారం జరిగిన ఐపిఎల్‌ సీజన్‌-16 ఫైనల్లో గుజరాత్‌పై సంచలన విజయం సాధించిన అనంతరం టైటిల్‌ అందుకొంటూ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఐపిఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇదే తగిన సమయమైనా.. అభిమానుల మద్దతు, వారి ప్రేమ నుంచి దూరంగా వెళ్లడానికి నా మనసు అంగీకరించడం లేదు.. మరో తొమ్మిది నెలలు కష్టపడి రాబోయే ఐపిఎల్‌లో ఆడడానికి ప్రయత్నిస్తా..' అన్నాడు. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171పరుగులు చేయాల్సిన చెన్నై జట్టును రవీంద్ర జడేజా చివరి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌ కొట్టి అద్భుత విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.