Jul 06,2023 18:18

ప్రజాశక్తి-నందిగామ : ధోనీ 44వ జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ధోనీ 77 అడుగుల భారీ కటౌట్‌ ప్రయాణికులు, వాహన చోదకులను ఆకట్టుకుంటోంది. గతేడాది కూడా ధోనీ పుట్టిన రోజు సందర్భంగా అదే ప్రాంతంలో సుమారు 44 అడుగల ఎత్తులో ధోనీ కటౌట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి 100 అడుగుల ఎత్తులతో కటౌట్‌ ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ .. వాహనదారుల భద్రతను దష్టిలో ఉంచుకుని 77 అడుగులకే పరిమితమయ్యినట్లు అభిమానులు తెలిపారు.