చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో ఘనత సాధించాడు. ఐపిఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరఫున ఆడిన ధోనీ.. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌కూ ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ(243మ్యాచ్‌లు), దినేశ్ కార్తీక్(242)ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక చెన్నై జట్టు ఐదోసారి టైటిల్ సాధించడంతో అత్యధిక టైటిళ్లు నెగ్గిన సారథిగా రోహిత్ శర్మ పేర ఉన్న రికార్డును ధోని సమం చేశాడు.
ఐపిఎల్ సీజన్-16 అవార్డులు..
విజేత జట్టు(చెన్నై) : రూ.20కోట్లు
రన్నరప్ : రూ.12.5కోట్లు
సీజన్-16 అత్యుత్తమ వేదికలు : ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం
ఆరెంజ్ క్యాప్ : శుభ్‌మన్ గిల్(890పరుగులు)
పర్పుల్ క్యాప్ : మహ్మద్ షమీ(28వికెట్లు)
ఫెయిర్ ప్లే ఆఫ్ ది సీజన్ : అజింక్యా రహానే
అత్యుత్తమ క్యాచ్ : రషీద్ ఖాన్
లాంగెస్ట్ సిక్స్ : పాఫ్ డుప్లెసిస్(115మీ.)
అత్యధిక ఫోర్లు : శుభ్‌మన్ గిల్(84)
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు : శుభ్‌మన్ గిల్
డ్రీమ్ లెవెన్ గేమ్ ఛేంజర్ అవార్డు : శుభ్‌మన్ గిల్
సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్ : గ్లెన్ మ్యాక్స్‌వెల్
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు : యశస్వి జైస్వాల్
ఐపిఎల్ ఫైనల్లో ఆటగాళ్లకు దక్కిన అవార్డులు..
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : డెవెన్ కాన్వె
క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ : ఎంఎస్ ధోని
లాంగెస్ట్ సిక్స్ : సాయి సుదర్శన్
అత్యధిక ఫోర్లు : సాయి సుదర్శన్
మెస్ట్ వాల్యుబుల్ అసెట్ ఆఫ్ ది మ్యాచ్ : సాయి సుదర్శన్
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ : సాయి సుదర్శన్
ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ది మ్యాచ్ : అజింక్యా రహానే










