May 31,2023 15:25

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ గాయంతోనే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆడాడు. మరోవైపు ముంబై కోకిలాబెన్‌ ఆసుపత్రిలో మోకాలి గాయానికి ధోనీ చికిత్స తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో చికిత్స ప్రారంభం అవుతుందని చెపుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌ లో చెన్నై జట్టు ఐదోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇంకోవైపు తన రిటైర్మెంట్‌కు సంబంధించి ధోనీ మాట్లాడుతూ, ఆట నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని..అయితే అభిమానుల కోసం మరో ఐపీఎల్‌లో ఆడతానన్నాడు.