Apr 05,2023 15:57

ఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్‌-గుజరాత్‌ మధ్య టోర్నీ తొలి మ్యాచ్‌లో క్యాచ్‌ పట్టే ప్రయత్నంలో విలియమ్సన్‌ కుడి కాలికి గాయమైన విషయం తెలిసిందే.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో శ్రీలంక ఆల్‌రౌండర్‌ దాసున్‌ శానకను గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులోకి తీసుకుంది. శానకను రూ.50 లక్షల కనీస ధరతో గుజరాత్‌ దక్కించుకుంది. కొన్ని నెలల కిందట జరిగిన వేలంలో శానకను కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపని విషయం తెలిసిందే.