న్యూఢిల్లీ : ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) షోకాజు నోటీసులు జారీ చేసింది. జులై 25,26 తేదిల్లో ఎయిరిండియాలో అంతర్గత ఆడిట్, ప్రమాద నివారణ, తగినంత మంది సాంకేతిక నిపుణులు వంటి అంశాల నిబంధనలపై డిజిసిఎ అధికారులు తనిఖీలు జరిపారు. ప్రమాదాల నివారణ విషయంలో కొన్ని లోపాలను గుర్తించింది. ఈ తనిఖీల్లో పలు బాధ్యతారాహిత్యాలను గుర్తించింది. దీంతో ఎయిరిండియా భద్రత హెడ్‌పై నెల రోజులు వేటు వేసింది.










