న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత్తి నేపథ్యంలో తమ కంపెనీల వ్యయాల తగ్గింపునపై దృష్టి పెట్టినట్లు 93 శాతం మంది భారత కంపెనీల సిఇఒలు అభిప్రాయపడ్డారు. తాము నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని యోచిస్తున్నామని కన్సల్టెన్సీ సంస్థ పిడబ్ల్యుసి నిర్వహించిన వార్షిక గ్లోబల్ సిఇఒ సర్వేలో తెలిపారు. ప్రతీ పది మంది సిఇఒలలో నలుగురు తమ కంపెనీలు ప్రస్తుత మార్గంలో కొనసాగితే 10 సంవత్సరాలలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయని ఆశించడం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే 12 నెలల్లో ప్రపంచ ఆర్థిక వద్ధి క్షీణిస్తుందని దాదాపు 78 శాతం మంది భారత సిఇఒలు, 73 శాతం ప్రపంచ సిఇఒలు, 69 శాతం ఆసియా పసిఫిక్ కంపెనీల సిఇఒలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల భవిష్యత్తు వృద్థిపై సందిగ్దత నెలకొన్నప్పటికీ భారత వృద్థి బాగానే ఉండొచ్చని 57 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు.










