Nov 09,2022 21:32

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ కాలంలో 33 శాతం పెరుగుదలతో రూ.7,027 కోట్ల పెట్టుబడుల వ్యయం చేసింది. గతేడాది ఇదే కాలంలో రూ.5,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దీర్ఘకాల లక్ష్యాలతో పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. దేశీయ బగ్గు ఉత్పత్తిలో కోల్‌ ఇండియా 80 శాతం వాటాను కలిగి ఉంది.