- తాజా బిడబ్ల్యుఎఫ్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానం
లాసన్నె: భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి కెరీర్ బెస్టు ర్యాంక్ సాధించారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో వీరు ఏకంగా 3వ స్థానానికి ఎగబాకారు. ఇటీవల జరిగిన ఇండోనేషియా సూపర్-1000 పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గడంతో వీళ్లు 3వ ర్యాంకుకు ఎగబాకారు. గత ఏడాదిగా ఈ జోడీ నిలకడగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఇండోనేషియాకు చెందిన ఆర్డియాంటో, అల్ఫియాన్ ద్వయం అగ్రస్థానం నిలబెట్టుకుంది. చైనా డబుల్స్ ప్లేయర్లు లియాంగ్, వాంగ్ రెండో రెండో ర్యాంక్ సాధించారు. అంతకుముందు వీరు స్విస్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్నారు. అలాగే కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణరు రారు 9వ ర్యాంక్‌లో ఉండగా.. లక్ష్యసేన్ 16వ, కిదాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్‌లో నిలిచి టాప్-20లో చోటు దక్కించుకున్నారు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు 12వ ర్యాంక్‌లో ఉండగా.. సైనా నెహ్వాల్ 31వ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల డబుల్స్‌లో యువ షట్లర్లు త్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్ జోడీ 16వ ర్యాంక్‌లో ఉన్నారు.










