- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రకటన
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసక బ్యాటర్ రజత్ పాటిదార్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఈరోజు వెల్లడించింది. అతను తొందరగా కోలుకోవాలని, ఈ కష్టకాలంలో ఫ్రాంచైజీ అతడికి మద్దతుగా ఉంటుందని ట్విట్టర్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు అతని ప్లేస్‌లో ఎవరిని ఆడించాలి అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ జట్టు కోచ్, మేనేజ్‌మెంట్ తెలిపింది. అషిల్లేస్ హీల్ గాయంతో బాధపడుతున్న పాటిదార్ పూర్తిగా కోలుకోలేదు. అతను ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన పాటిదార్ పదిహేనో సీజన్‌లో చెలరేగాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. అతను150 స్ట్రైక్ రేటుతో 333 పరుగులు కొట్టాడు. ఇరానీ ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. దాంతో, 16వ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లైనా ఈ స్టార్ బ్యాటర్ ఆడతాడని ఆర్సీబీ అనుకున్నా.. ఇంకా పూర్తిగా కోలుకోని కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైనట్లు మంగళవారం ప్రకటించింది.
Unfortunately, Rajat Patidar has been ruled out of #IPL2023 due to an Achilles Heel injury. 💔
— Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2023
We wish Rajat a speedy recovery and will continue to support him during the process. 💪
The coaches and management have decided not to name a replacement player for Rajat just yet. 🗒️ pic.twitter.com/c76d2u70SY










