Jun 17,2023 22:16

ఏకైక టెస్ట్‌లో ఆఫ్ఘన్‌పై 546పరుగుల తేడాతో గెలుపు
ఢాకా: అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు 546పరుగుల తేడాతో గెలిచింది. ఒక జట్టు టెస్టు మ్యాచ్‌లో ఇంత భారీ పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. అలాగే టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది మూడో భారీ విజయం. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 45పరుగులతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు నాలుగో రోజు ఆట 115 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 382 పరుగులు చేయగా.. అఫ్ఘాన్‌ జట్టు 146 పరుగులకే చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాజట్టు 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు రాబట్టి డిక్లేర్‌ చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ నజ్ముల్‌కు లభించింది. దీంతో ఆఫ్ఘన్‌ జట్టు 662 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. అంతకుముందు 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ జట్టు 675 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అదే అత్యంత భారీ విజయంగా రికార్డులో ఉంది. ఆ తర్వాత 1934లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా జట్టు 562 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అది టెస్టుల్లో రెండో భారీ విజయంగా రికార్డుల్లో ఉన్నది.