Sep 14,2023 10:10

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో ఓ పబ్‌ ఎదుట బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ యువతి విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఓ వర్గంలో సిద్ధార్థ మాగమ్‌ ఉండగా.. మరో వర్గంలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌ ఉన్నట్లు సమాచారం. పబ్‌లో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కాసేపటి తరువాత బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్‌కు గాయాలయ్యాయి. పోలీసులకు దాడులకు సంబంధించి సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.