ప్రజాశక్తి-అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దర్యాప్తు అధికారి మారుస్తూ ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఏస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్‌లు బాధ్యతలు అప్పగించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారి మార్పుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. జయరాజుకు పని భారం ఎక్కువుగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మార్పు చేసినట్లు సీఐడీ పిటీషన్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నారా లోకేష్‌ను అధికారులు విచారించనున్నారు.










