వాషింగ్టన్ : గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ మరోమారు ఉద్యోగుల తొలగింపునకు పాల్పడింది. ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. నియామకాల విభాగంలోని వందలాది మందిపై వేటు వేసింది. వీరిలో చాలా మంది గ్లోబల్ రిక్రూట్‌మెంట్ బృందం నుంచి ఉన్నారని రాయిటర్స్ వెల్లడించింది. కొత్తగా నియామకాలను కూడా తగ్గించినట్లు పేర్కొంది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. అల్పాబెట్ ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 12 వేల మంది లేదా 6 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది.










