హైదరాబాద్ : ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసిమ్ ఇండిస్టీస్ కొత్తగా పెయింట్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. 'బిర్లా ఓపస్' బ్రాండ్ పేరుతో వచ్చే మార్చి త్రైమాసికంలో మార్కెట్లోకి వస్తోన్నట్లు పేర్కొంది. అలంకరణ పెయింట్స్ విభాగంలో అధిక నాణ్యత ఉత్పత్తులను అందించనున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. పెయింట్స్ రంగంలోకి ప్రవేశం ఒక వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో ఎంపికగా నిలుస్తుందన్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి గ్రాసిమ్ గతంలో రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.










