ప్రజాశక్తి -కలకడ (అన్నమయ్యజిల్లా) : జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ లబ్ధిదారులను కోరారు. బుధవారం మండలంలోని బాటవారిపల్లి పంచాయతీ స్థానిక జగనన్న కాలనీ ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ జగనన్న కాలనీలో ఇళ్లను పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేస్తే ప్రభుత్వ నుండి బిల్లులు వీలైనంత తొందరలో వచ్చేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తే రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నిర్మాణ బిల్లులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ నిండి నిర్మాణాలు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ చరిస్మాంజలి, భరత్, తదితరులు పాల్గొన్నారు.