Jun 19,2023 21:26

పారిస్‌ : అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య(ఏటిపి) తాజా ర్యాంకింగ్స్‌లో సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌కు ముందు 2వ ర్యాంక్‌కే పరిమితమైన జకోవిచ్‌.. ఆ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను చేజిక్కించుకోవడంతో యువ ఆటగాడు కార్లోస్‌ అల్కరాజ్‌ను వెనక్కి నెట్టి టాప్‌ ర్యాంక్‌కు ఎగబాకాడు. తాజా ర్యాకింగ్స్‌ ప్రకారం నొవాక్‌ జకోవిచ్‌ 7595పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అల్కరాజ్‌ 7175పాయింట్లతో రెండోస్థానానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత మెద్వదెవ్‌(రష్యా), కాస్పర్‌ రూఢ్‌(నార్వే), సిట్సిపాస్‌(గ్రీక్‌) టాప్‌-5లో కొనసాగుతున్నారు.
ఏటిపి టాప్‌-10 ర్యాంకింగ్స్‌..
1. నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా) - 7595పాయింట్లు
2. కార్లోస్‌ అల్కరాజ్‌(స్పెయిన్‌) - 7175 ,,
3. డానియెల్‌ మెద్వదెవ్‌(రష్యా) - 5845 ,,
4. కాస్పర్‌ రూఢ్‌(నార్వే) - 4960 ,,
5. స్టెఫొనస్‌ సిట్సిపాస్‌ - 4875 ,,
6. హోల్జర్‌ రూనే(డెన్మార్క్‌) - 4375 ,,
7. ఆండీ రుబ్లేవ్‌(రష్యా) - 4000 ,,
8. టేలర్‌ ఫ్రిట్జ్‌(అమెరికా) - 3515 ,,
9. జెన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ) - 3300 ,,
10. ఫెన్సె టఫీ(అమెరికా) - 3085 ,,