Oct 10,2023 12:20

ప్రజాశక్తి-అమరావతి: ఏపీ హైకోర్టులో మంగళవారం చంద్రబాబు దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్‌ నిరాకరించడంతో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.