Oct 31,2022 21:19

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లోఎజిఐ గ్రీన్‌పాక్‌ నికర లాభాలు 11.67 శాతం పెరిగి రూ.33.96 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.30.41 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.309.44 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ2లో 65.64 శాతం వృద్థితో రూ.512.55 కోట్లకు చేరిందని ఆ కంపెనీ వెల్లడించింది. గడిచిన ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో కంపెనీ నికర లాభాలు 101 శాతం ఎగిసి రూ.100 కోట్లుగా నమోదయ్యాయి.