Nov 02,2022 20:46

బెంగళూరు : పునరుత్పాదక విద్యుత్‌ సంస్ధ యాక్సిస్‌ ఎనర్జీ గ్రూప్‌లో భాగమైన ఎబిసి క్లీన్‌టెక్‌ రూ.50వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. కర్నాటకలో ఏడాదికి 0.2 మిలియన్‌ టన్స్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రంతో పాటుగా 5 గిగావాట్‌ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎబిసి క్లీన్‌టెక్‌ సిఎండి రవి కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనతో నెట్‌జీరో కార్బన్‌ ఆర్ధిక వ్యవస్ధ దిశగా దేశం పయణించేందుకు తోడ్పడగలమనే విశ్వాసంతో ఉన్నామన్నారు.