ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : చంద్రయాన్ -3 విజయవంతం కావడంతో అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన భారతీయ ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధనలు దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకే తలమానికంగా నిలిచాయని వారి కృషిని అభినందిస్తూ అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పోలిశెట్టి నరసింహ చంద్రకుమార్ ల్యాండర్ విక్రమ్ నుండి వేరుపడి చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్ చిత్రాన్ని కలర్ పెన్సిల్స్ ఉపయోగించి వేశారు. ఈ చిత్రం చూపరులను ఆకట్టుకుంది.










