హైదరాబాద్: ఐపీఎల్-16 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై రాజస్థాన్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 131 పరుగులే చేసింది. సమద్ (32) టాప్ స్కోరర్. మయాంక్ అగర్వాల్ (27) పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4, ట్రెంట్ బౌల్ట్ 2,అశ్విన్, జేసన్ హౌల్డర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠి (0)లను ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. చాహల్ వేసిన ఏడో ఓవర్‌లో చివరి బంతికి బ్రూక్ (13) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే హౌల్డర్ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ (1) హెట్‌మైయిర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్‌లోనే గ్లెన్ ఫిలిప్స్ (8) ఆసిఫ్‌కు చిక్కాడు. చాహల్ వేసిన 11 ఓవర్‌లో మయాంక్ అగర్వాల్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో హైదరాబాద్ 52/6 పీకల్లోతు కష్టాల్లో పడింది. చాహల్ వేసిన 14 ఓవర్‌లో చివరి బంతికి అదిల్ రషీద్ (18) స్టంపౌటయ్యాడు. ఆఖర్లో సమద్ (32), ఉమ్రాన్ మాలిక్ (19) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (54బీ 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసానికి తోడు యశస్వీ జైస్వాల్ (54బీ 37 బంతుల్లో 9 ఫోర్లు), శాంసన్ (55బీ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు. హైదరాబాద్‌బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖి, నటరాజన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు.










