Jan 17,2023 21:00

హైదరాబాద్‌ : డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ ఒక మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నిధులు సమీకరించినట్లు తెలిపింది. బ్రిడ్జ్‌ రౌండ్‌లో తమ వినియోగదారులు, వారి రిఫరెల్స్‌ నుంచి ఈ మొత్తాన్ని పొందినట్లు మంగళవారం వెల్లడించింది. బ్రాండ్‌ యొక్క విశ్వసనీయత, అత్యున్నత నాణ్యత, సాటిలేని వినియోగదారుల అనుభవాలకు ప్రతీకగా ఇది నిలుస్తుందని సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌, ఎండి డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి పేర్కొన్నారు. ఈ నిధులను నూతన ఉత్పత్తి అభివద్ది, మౌలిక వసతుల ఆధునీకరణ, డిజిటల్‌ పరివర్తన అవసరాల కోసం వినియోగించనున్నామన్నారు.