Nov 01,2022 20:50

ముంబయి : గడిచిన అక్టోబర్‌లో 730 కోట్ల యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యుపిఐ) లావాదేవీలు చోటు చేసుకున్నట్లు ఎన్‌పిసిఐ వెల్లడించింది. వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. గతేడాది ఇదే నెల లావాదేవీల సంఖ్యతో పోల్చితే 73 శాతం, విలువ పరంగా 57 శాతం చొప్పున పెరిగాయని ఎన్‌పిసిఐ పేర్కొంది.