Jan 14,2023 21:15

ముంబయి : డిమార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మర్ట్స్‌ 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 6.71 శాతం వృద్థితో రూ.589 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. 2021 ఇదే అక్టోబర్‌ డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.552.53 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.9,217 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన త్రైమాసికంలో 25.50 శాతం పెరిగి రూ.11,569.05 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో అవెన్యూ సూపర్‌మర్ట్స్‌ వ్యయం 27.02 శాతం పెరిగి రూ.10,788.86 కోట్లుగా నమోదయ్యింది. 2021ా22 డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.8,493 కోట్ల వ్యయాలు చేసింది.