ప్రజాశక్తి - బిజినెస్ బ్యూరో : ఉద్యోగుల సృష్టిలో సూక్ష్మ, చిరు వ్యాపార సంస్థలు కీలక పాత్ర పోశిస్తున్నాయని అప్నా డాట్ కో ప్లాట్‌ఫామ్ పేర్కొంది. గడిచిన మూడు నెలల్లో విశాఖపట్నంలోని 50 శాతం పైగా ఉద్యోగావకాశాలను చిరు సంస్థలే సృష్టించాయని తెలిపింది. రాష్ట్రంలో తమ సంస్థకు 5వేలకు పైగా సంస్థలుండగా.. వీరిలో 2500 మంది వైజాగ్‌లోని వారేనని పేర్కొంది. టెలికాలింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, డెలివరీ పర్సన్, ఫీల్డ్ సేల్స్, డాటా ఎంట్రీలో ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయని పేర్కొంది. గడిచిన 90 రోజుల్లో 1.30 లక్షల ఉద్యోగ దరఖాస్తులు నమోదయినట్లు పేర్కొంది.










