Nov 04,2022 21:30

న్యూఢిల్లీ : ప్రముఖ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ గెయిల్‌ లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 46.31 శాతం తగ్గి రూ.15,37 కోట్ల లాభాలకు పరిమితమయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,862.95 కోట్ల లాభాలు సాధించింది. గడిచిన క్యూ2లో కంపెనీ గ్యాస్‌ మార్కెటింగ్‌ రెవెన్యూ రెట్టింపై రూ.35,465.35 కోట్లుగా నమోదయ్యింది.