Nov 10,2022 21:14

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఆల్‌ కార్గో లాజిస్టిక్స్‌ నికర లాభాలు 13 శాతం తగ్గి రూ.230 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.263 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.4,978 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ2లో 6.5 శాతం పెరిగి రూ.5,300 కోట్లకు పెరిగినట్లు ఆ కంపెనీ తెలిపింది.