న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రిలయన్స్ ఇండిస్టీస్ రూ.17,806 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3 లాభాలు రూ.20,539 కోట్లతో పోల్చితే 13.3 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. కాగా.. 2022 సెప్టెంబర్ త్రైమాసికం లాభాలు రూ.15,512 కోట్ల లాభాలతో పోల్చితే 14.78 శాతం పెరుగుదల నమోదయ్యింది. క్రితం క్యూ3లో కంపెనీ రెవెన్యూ 15.32 శాతం వృద్థితో రూ.2.,20,592 కోట్లుగా నమోదయ్యింది. శుక్రవారం రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ బిఎస్‌ఇలో 1.15 శాతం తగ్గి రూ.2,442.70 వద్ద ముగిసింది.










