Jul 17,2023 20:35

 

  • తిరుపతి నుంచి తిరుమలకు 50 బస్సులు
  • ఆర్‌టిసి చైర్మన్‌ మల్లికార్జున రెడ్డి

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీలో అగ్రగామి సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి)కు వంద బస్సులను సరఫరా చేసింది. ఇప్పటికే 88 బస్సులను అందజేయగా మిగతా 12 బస్సులను సోమవారం అందించింది. ఈ 12 బస్సులు అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి తిరుపతికి నడపనున్నారు. మదనపల్లి ఆర్‌టిసి డిపోలో ఎపిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌ ఏ.మల్లికార్జునరెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 50 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు, 14 తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి, కడప నుంచి తిరుపతికి 12, నెల్లూరు నుంచి తిరుపతికి 12 బస్సులు నడుస్తున్నాయన్నారు. తాజాగా మదనపల్లి నుంచి తిరుపతికి 12 బస్సులు నడవనున్నాయని తెలిపారు.