Jul 18,2022 19:38


ప్రతిరోజూ ఓ గుప్పెడు తులసి ఆకులను నీటిలో మరిగించి, గోరువెచ్చగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
* వర్షాకాలంలో తులసి కషాయం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* జలుబు, దగ్గు, గొంతునొప్పి, గొంతులో గరగర.. ఇతర సమస్యలు దూరమవుతాయి.
* మధుమేహ వ్యాధిగ్రస్తులు తులసి నీరు తాగుతుంటే చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
* శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. తులసి నీరు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
* తులసి నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా, విషపూరిత పదార్థాలు శరీరం నుండి బయటకు వస్తాయి.
* తులసి నీటిని తాగడం ద్వారా, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరంగా ఉంటాయి. మలబద్ధకం, నీళ్ల విరేచనాల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కడుపులో ప్రశాంతంగా ఉంటుంది.
* ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే జ్వరం, ఇతర వైరల్‌ సంక్రమణను చాలావరకు నివారించవచ్చు.
* పొద్దున్నే తులసి నీరు తాగడం వల్ల సీజనల్‌ ఇన్ఫెక్షన్లకు చెక్‌ పెట్టవచ్చు.