Aug 23,2022 10:48

ప్రజాశక్తి-నందిగామ: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త బంద్  నేపధ్యంలో నందిగామలో  ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల పిలుపుమేరకు స్వచ్ఛందంగా ప్రశాంత వాతావరణంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడం పట్ల సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వైఖరిని సిపిఎం నాయకులు తప్పు పట్టారు. తక్షణమే  విద్యార్థులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నందిగామ మండల కార్యదర్శి కటార్ గోపాల్, సిపిఎం నాయకులు సైదులు, ఖాసిం, హసేన్, తదితరులు పాల్గొన్నారు.