Jun 28,2023 14:19

ముంబయి   :  స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ అల్‌ టైమ్‌ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. బుధవారం ప్రారంభ ట్రేడ్‌లో సెన్సెక్స్‌ 299.97 పాయింట్ల లాభపడి ఆల్‌ టైమ్‌ రికార్డుస్థాయి రూ. 63,716కి చేరుకుంది. నిఫ్టీ 90.75 పాయింట్లు లాభపడి జీవనకాల గరిష్టం రూ.18,908.15 చేరుకుంది. విదేశీ నిధుల ప్రవాహం పెరగడం, అమెరికన్‌ మార్కెట్లలో సానుకూల పవనాలతో సూచీలు రికార్డు స్థాయికి చేరినట్లు నిపుణులు తెలిపారు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల షేర్లు  మార్కెట్‌ల్లో అత్యధికంగా కొనుగోలు చేయడంతో సూచీలు  లాభాల బాట పట్టాయని అన్నారు. సెన్సెక్స్‌ కింద టైటాన్‌, బజాజ్‌ ఫినాన్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐటిసి, లార్సెన్‌ అండ్‌ టర్బో, ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌ లు లాభాలను పొందాయి. టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టిపిసిలు నష్టాల్లో కొనసాగాయి.