ముంబయి : దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభట్రేడ్‌లో లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. సుమారు ఏడు నెలల తర్వాత సెన్సెక్స్ ఈ మైలు రాయిని చేరుకోవడం గమనార్హం. ట్రేడింగ్ ప్రారంభం కాగానే.. సెన్సెక్స్ 146 పాయింట్లు పెరిగి గరిష్టంగా రూ. 63,473.70 వద్ద కొనసాగుతోంది. ఆ తర్వాత సెన్సెక్స్ 260.61 పాయింట్లకు పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.63,588 కి చేరుకుంది. గతేడాది డిసెంబర్ 1న సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. నిఫ్టీ 37 పాయింట్లతో రూ.18,853 వద్ద కొనసాగుతోంది. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, హిందుస్థాన్ యూనీలివర్, లార్సెన్ అండ్ టర్బో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, టాటా కన్స్‌ల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండిస్టీస్ లాభ పడగా, టాటాస్టీల్, ఎన్‌టిపిసి, టాటామోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్‌లు నష్టాల్లో కొనసాగాయి.










