- బిజెపికి దూరం జరగాలని వైసిపి, టిడిపికి విజ్ఞప్తి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రత్యేక హాదాసాధన కోసం విద్యార్ది సంఘాలు, యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు, కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని ప్రత్యేకహోదాసాధనా సమితి నిర్ణయించింది. మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అధ్యక్షతన విజయవాడ బందరురోడ్డులోని బాలోత్సవ భవన్‌లో శుక్రవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనిఏకగ్రీవంగా తీర్మానించారు. నిరవధిక దీక్ష చేయాలనివచ్చిన ప్రతిపాదనలపై అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలను అభిప్రాయాన్ని ఈ సమావేశం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపికి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు దూరం జరగాలని విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిగా గుర్తించాల్సి వస్తుందని రౌండ్‌టేబుల్ సమావేశం హెచ్చరించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు(వైవి) మాట్లాడుతూ రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేసిందన్నారు. విభజన చట్టం హామీలు, ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు గురించి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్లు బిజెపి వ్యవహరిస్తోందన్నారు. వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన బెట్టి బిజెపి ఏమి చెబితే వాటికి తలగ్గుతున్నాయన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి ఒకరినొకరు వ్యతిరేకిస్తునుట్లు నటిస్తూ బిజెపికి పార్లమెంటులో మద్దతు ఇవ్వడమంటే రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదా? అని ఆయన ప్రశిుంచారు. హోదా, విభజన హామీల అమలు చేయకుండా బిజెపి వ్యవహరిస్తుంటే నిలదీయాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. ప్రత్యేకహోదా సాధనతో పాటు పోలవరం నిర్వాసితులకు అండగా సిపిఎం నిలుస్తుందన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారామ్ మాట్లాడుతూ పునర్విభజన చట్టం అమలు చేయకుండా కేంద్రంలోని బిజెపి తుంగలో తొక్కిందనాురు. ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదనాురు. పోలవరం ప్రాజెకుసాంకేతిక అంశాలపై మాత్రమే రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు. సర్వస్వానిు త్యాగం చేసి నిర్వాసితులుగా మారిన గిరిజనుల గొంతుకను విజయవాడలో సిపిఎం వినిపించిందన్నారు. పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ నిర్మాణానికి నిధులు ఇస్తామని చెబుతున్నారే తప్ప నిర్వాసితులకు నిధులు ఇవ్వక పోయినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం దురదృష్టకరమనాురు . గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు కోసం కొత్తవలసలో 525 ఎకరాల భూమి కేటాయించారే తప్ప పనుల పురోగతి లేదనాురు. విశాఖస్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. అదాని చేతిలోకి ఫ్యాక్టరీ వెళ్లిన అనంతరం ఒక్క గిరిజనుడికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవన్నారు. అటవీచట్టం 2006ను యుపిఎ ప్రభుత్వం తీసుకు వస్తే బిజెపి ఆ చట్టానికి సవరణలు చేసి గిరిజనులకు అన్యాయం చేసిందన్నారు. విశాఖలో కాఫీబోర్డును చిక్‌మగుళూరుకు పంపిందన్నారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ సాధన కోసం అనేక సార్లు కేంద్రమంత్రులను కలిశామన్నారు. విశాఖజోన్ ఏ రోజు నుంచి విశాఖ నుంచి ప్రారంభిస్తునాుమనే తేదీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తేదీ ప్రకటించకుండా నిధులు విదుదల అంటే ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. పోలవరం నిర్వాసితులు, గిరిజనులు కొండలు గుట్టలు ఎక్కుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు కూడా కలగడంలేదన్నారు. మణిపూర్ ఘటనలపై ప్రధాని సభకు రాకుండా తప్పించుకుని తిరుగుతుంటే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న సందర్భంలో వైసిపి, టిడిపి బిజెపికి మద్దతుగా నిలిచాయన్నారు. విభజన హామీల అమలు కోసం క్షేత్రస్దాయిలో ప్రజలను చైతన్యవంతును చేసేందుకు ఆగస్టు 16, 17 తేదీల్లో ప్రారంభించి 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ప్రచారయాత్రను చేయాలని నిర్ణయించామన్నారు.
ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు మాట్లాడుతూ ప్రత్యేకహోదాను గొంతు నులిపింది తొలుత చంద్రబాబేనన్నారు. కడప స్టీల్‌ప్లాంట్ సాధ్యంకాదని, దుగరాజపటుం కూడా సాధ్యం కాదని కేంద్రమంత్రి ప్రకటించినా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు స్పందించడం లేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌కుముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్ధాపన చేశారని, పునర్విభజన చట్టంలో ఉనుప్పటికీ నేడు కేంద్రం లాభదాయకం కాదనిచెప్పడమంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ ప్రత్యేకహోదా అమలు చేయకపోతే ఓటు వేయమనే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈనెల 30న రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, ప్రభాకర్‌రెడ్డి, సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరశెట్టి నరసింహారావు, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఆమ్‌ఆద్మీనాయకులు చెనుుపాటి వజీద్, అమరావతి దళిత బహుజన నాయకులు పోతుల బాలకోటయ్య, ఎపి జరులిస్టు ప్రొఫెషనల్ ఫోరం నాయకులు కృష్ణాంజనేయులు, ఎఐవైఎఫ్ ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ , ప్రజాసంఘాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, పలువురు నేతలు పాల్గొన్నారు.










