తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి సిద్ధమైయ్యారు. రేపు (నవంబర్ 17న) తెలంగాణలో పర్యటనలో భాగంగా ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. రాహుల్ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక సభ, రోడ్ షో నిర్వహించి, మధ్యాహ్నం నర్సంపేటకులో ప్రచారం చేయనున్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో ఆయన పర్యటించి ప్రచారం చేయనున్నారు. తరువాత తిరిగి ఢిల్లీకి వెళ్తారు. అయితే మరోసారి కూడా రాహుల్ తెలంగాణలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ మినహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ఏఐసీసీ అగ్రనేతలు కూడా 21 తర్వాత తమ పూర్తి సమయాన్ని తెలంగాణకే కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.