ప్రజాశక్తి-నందిగామ : జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ ఆటల పోటీలలో పెద్దవరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 19వ తేదీన నందిగామ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ వాలీ బాల్ అండర్ 14, అండర్ 17 బాలబాలికల నియోజకవర్గ స్థాయి సెలక్షన్ లో పెద్దవరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు నాగహర్షిత, దివ్య, శిరిష, శ్రీ లక్ష్మీ, నవిత, జయశ్రీ, సబీరలు జిల్లా స్థాయికు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాకమూరు శ్రీనివాస్ ప్రసాద్ బుధవారం తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో ఆడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాకమూరు శ్రీనివాస్ ప్రసాద్, పిఇటి కొట్టు వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.










