ప్రజాశక్తి-జగ్గయ్యపేట: సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఒరవడిని సృష్టిస్తున్నారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. పట్టణంలోని 11వ సచివాలయం 24వ వార్డు ఉర్దూ స్కూలు, యానాది కాలనీ, మసీదు బజార్ తదితర ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యులు సామినేని ఉదయభాను బుధవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల బ్రోచర్లను అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించి పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎవరేంటో తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి రానున్న ఎన్నికల్లో మరొకసారి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు పెంటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కుంచాపు నారాయణ, కౌన్సిలర్లు సాధుపాటి రాజు, బుజ్జి, ఉప్పుతోళ్ల నరసింహారావు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ తదితురులు పాల్గొన్నారు.










