Jul 05,2023 17:30

ప్రజాశక్తి-కోటనందూరు : సంక్షేమ  పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం కాకినాడలోని ఎస్ఆర్ పేట గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శశివాలయ భవనాన్ని ప్రారంభించారు. అల్లిపూడి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ గ్రామ స్వపరిపాలన సచివాలయాలతోనే సాధ్యమని గ్రామీణ ప్రాంత ప్రజలు సమయాన్ని, ధనాన్ని, వృధా కాకుండా వారి యొక్క సమస్యలన్నీ సచివాలయంలోనే పరిష్కరించే దిశగా ఒక ఉన్నతమైన ఆశయంతో సచివాలయం వస్తున్న రూపొందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందని అన్నారు. జగనన్న సురక్ష పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి 11 రకాల సర్టిఫికెట్లు అన్నీ ఉచితంగా పొందవచ్చు అని అన్నారు. అన్ని సర్టిఫికెట్ లో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని అన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియా జగన్ను పాలల్లో ప్రజలు ఆదరణ చూసి ఓర్వలేక తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని దీనిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ ,మండల కన్వీనర్ చింతకాయల చినబాబు, తుని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణజి, రూతల జోగిరాజు, నల్లమిల్లి గోవిందు, వైస్ ఎంపీపీ బంటుపల్లి గంగాధర్, వేముల రాజబాబు బంటుపల్లి వెంకటేశ్వరరావు, ఆప్షన్ సభ్యులు జగటాల కోట సత్తిబాబు, గరిసింగు దొరబాబు, జగటాల వీరబాబు, సుర్ల రాజు ,సుర్ల రాంబాబు, తరిపే నూకాలమ్మ, గొర్రెల రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.