Jul 30,2023 15:03

ప్రజాశక్తి-పెదబయలు : స్థానిక గిరిజన సంక్షేమ వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు సెలవు వస్తే చాలు సంక్షేమశాఖ అధికారులు ఇళ్లకు పంపేంచేస్తున్నారు. శనివారం రెండవ, శనివారం ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో విద్యార్థినిలను ఇళ్లకు పంపించేస్తున్నారు. పాఠశాల వసతి గృహాలు తెరచి రెండు నెలలు కాలేదు. అప్పుడే ఇళ్లకు విద్యార్థులు వెళ్లిపోవడన్ని పలువురు అనేక అపోహలు మాట్లాడుతున్నారు. శనివారం ఉదయం కొంతమంది విద్యార్థినిలు బస్సులు లేక జెపులలో అత్యధిక చార్జీలు చెల్లించి ప్రయాణమయ్యారు. మరికొంతమంది హాస్టల్ సమీప్లో గల బస్సు స్టాండ్ లో బస్సు ఏక్కకుండా రోగులపేట జంక్షన్ లో బస్సు ఎక్కారు. మావోయిస్టు వారోత్సవాలా సందర్బంగా గోమాంగి, లక్ష్మీపేట బస్సులు రద్దు చేయడంతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి ఇళ్లకు వెళుతున్నారు. హాస్టల్లో నుండి సేవు పేరుతో ఇళ్లకు పోతే సంక్షేమ అధికారులు దొంగ హాజరు వేసి మేనోలో వచ్చే సొమ్ము ఏంచెక్క మిగిలించుకోవచ్చని భావనతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆశ్రమ వసతిగృహల్లో చదువుకొంటున్న విద్యార్థులు మండల కేంద్రానికి మారుమూల ప్రాంతాలకు చెన్ఫినవారే కావడంతో వారు తల్లి దండ్రుల సహకారంతో వెళ్ళాసి ఉంది. కానీ  విద్యార్థులు జట్లు జట్లుగా బయలుదేరి వెళ్తున్నారు. మరుమూల ప్రాంతాల్లో జోరు వర్షం వాగులు వంకలు  ప్రమాదవాసత్తు ఏమైనా జరగరానిది జరిగేతే సమాధానం ధోరకని పరిస్థితి నెలకొని ఉంది. ఇల్లకు వెళ్లే విద్యార్థులు 12ఏళ్ల మధ్యావయస్కూలే  కావడం విచారకరం శనివారం ఉదయం స్థానిక నంబర్ వన్ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థినిలను విలేఖరుల బృందంతో మాట్లాడుతూ వర్షాలతో ఇళ్లకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించగా మెనూ లేదని ఎప్పుడు కృల్లిన వంకాయలు బంగాళాదుంప దొండకాయలే తప్ప ఇతర కూరగాయలు వండించి పెట్టారని బక్క పలచ్చని కూర సాంబారు పెడ్తారని అన్నారు.  విద్యార్థినిలకు తల్లిదండ్రులతో తోడు ఇచ్చి ఇళ్లకు పంపించాలి ప్రధాన ఉపాధ్యాయుల అనుమతి పొందిన తరువాతనే ఇళ్లకు వెళ్ళాలి కానీ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థులను ఇళ్లకు పంపించి వేస్తున్నారు.  స్థానిక ఏ టి డ బుల్యూ వారికీ చరవానితో విలేఖరుల టీమ్ ఫోన్ చెయ్యగలరు స్పందించలేదు. ఉన్నత అధికారులు వసతి గృహల్లో పర్యవేక్షణ లేకపోవడంతో సాంక్షేమ ఉపఅధికారులు ఇస్టానుసారంగా వ్యవరిస్తున్నారు. ఆగస్ట్ 1 నుండి పార్ మేటివ్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులను ఇళ్లకు పంపించడం  అంతర్యామేమిటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నత అధికారులు ద్రుష్టి సారించి వర్షాకాలంలో విద్యార్థులను ఇళ్లకు పంపించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులంటున్నారు.