Jun 29,2023 15:53

న్యూఢిల్లీ  :  బక్రీద్‌ సందర్భంగా దేశ ప్రజలకు గురువారం ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్య ఐక్యత, సామరస్య స్ఫూర్తి ఉండాలని అన్నారు. ''ఈద్‌ -అల్‌-అదాహ్  (బక్రీద్‌) సందర్భంగా శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతి ఒక్కరికీ సంతోషం, శ్రేయస్సును కలిగించాలి. ఈ రోజు ప్రజల్లో ఐక్యతను, సామరస్య స్ఫూర్తిని నింపుతుంది. ఈద్‌ ముబారక్‌ '' అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. '' ఈద్‌ ముబారక్‌. ఈ శుభ సందర్భం అందరికీ శాంతి, సౌభాగ్యం మరియు సంతోషం కలిగించాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్‌ చేశారు.