ప్రజాశక్తి-యంత్రాంగం
మహిళ స్వావలంన కోసం సిఎం వైఎస్.జగన్ వైఎస్‌ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారని పలువురు నాయకులు తెలిపారు. శనివారం పలు ప్రదేశాల్లో ఆసరా పథకంలో చెక్కులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
తాళ్లరేవులో ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్ కుమార్ 1450 సంఘాలకు రూ.10.62 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఎం వైఎస్.జగన్ మాట తప్పని ముఖ్యమంత్రిగా అందరికీ ఆదర్శంగా నిలిచార న్నారు. అనంతరం ఎంఎల్‌ఎను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మహిళా నాయకులు పోతుల రత్నకుమారి, మహిళా సంఘాల సభ్యులు నాగలక్ష్మి, దుర్గ, లోవ లక్ష్మి, ఎంపిడిఒ విజరు థామస్, ఎపిఒ వీరబాబు మహిళలు పాల్గొన్నారు. మండపేటలో వైసిపి రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజబాబు ఆధ్వర్యాన డొక్కా సీతమ్మ కమ్యూనిటీ హాల్లో సిఎం వైఎస్.జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, పోతంశెట్టి ప్రసాద్, ముమ్మిడివరపు బాపిరాజు, పెంకే గంగాధర్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట స్త్రీ శక్తి భవనంలో డిఆర్‌డిఎ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. సిఎం వైఎస్.జగన్ ఇచ్చిన హామీని అమలు చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలరిన చెప్పారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి గిర జాల బాబు, స్టాలిన్, కడియాల లక్ష్మణ్, నెల్లి సర్వేశ్వర రావు, పిల్లి నిర్మల, కడలి వెంకటేశ్వరరావు, బోట్ రాము, రాము శర్మ, రేలంగి వెంకటేశ్వరరావు, వై.జనార్థన రావు పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణ పరిధిలో ఈ నెల 17వ తేదీ వరకు వైఎస్‌ఆర్ ఆసరా వారోత్సఆవలు నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ జి.శేఖర్ తెలిపారు. శనివారం స్థానిక సాగర్ మున్సిపల్ పాఠశాలలో 1, 2, 3, 4, 5 వార్డులకు సంబంధించి నిర్వహించిన వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గండేపల్లి మండలం వెలంపేట రామాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిడిఓ జాన్ లింకన్ మాట్లాడారు. ఎపిఎం ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిసిఇ, యానిమేటర్ వల్లూరి పద్మ తదితరులు పాల్గొన్నారు.










