Jan 20,2023 22:51
  •  12,000 ఉద్యోగాలకు ఉద్వాసన
  • సిఇఒ సుందర్‌ పిచాయ్ వెల్లడి
  • అదే బాటలో స్విగ్గీ

శాన్‌ఫ్రాన్సిస్కో : టెకులాజీ కంపెనీల్లోని ఉద్యోగాలు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయి. తాజాగా గూగుల్‌ మాతృసంస్థ అల్పాబెట్‌ వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 12,000 మంది సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నట్లు గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) సుందర్‌ పిచాయ్ వెల్లడించారు. ఇదే విషయమై ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్‌ ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. మిగితా ప్రాంతాల వారికి త్వరలోనే సమాచారం ఇవ్వనున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో ఇప్పటికే ట్విట్టర్‌, మెటా, అమెజాన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమమయం ఆసనుమైందని పిచారు పేర్కొన్నారు. రిక్రూటింగ్‌, కార్పొరేట్‌ కార్యకలాపాలు, ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్స్‌ టీమ్‌కు చెందిన విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోనూ తొలగింపులు ఉనాుయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కోతలు ఉనుప్పటికీ.. అమెరికాలో సిబ్బందిపై వెంటనే అమల్లోకి వస్తుందనిగూగుల్‌ తెలిపింది. కాగా.. తదుపరి ఉపాధి చూసుకునే వారికి సాయం అందిస్తామని తెలిపింది. కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు తగిన పరిహార ప్యాకేజీ చెల్లిస్తామని పిచాయ్ తెలిపారు. 16 వారాల వేతనంతో పాటు గూగుల్‌లో పనిచేసిన ప్రతి ఏడాదికి రెండు వారాల వేతనంతో పాటు పలు ప్రయోజనాలను ప్యాకేజ్‌లో వర్తింప చేస్తామనాురు. ఉద్యోగం కోల్పోయిన వారికి 2022కుసంబంధించి బోనస్‌తో పాటు వెకేషన్‌ టైమ్‌, ఆరు నెలల పాటు హెల్త్‌ కేర్‌, జాబ్‌ ప్లేస్‌మెంట్‌ సర్వీసులు, ఇమ్మిగ్రేషన్‌ మద్దతును సపోర్ట్‌ను అందించనునుట్లు తెలిపారు. 
అమెరికా వెలుపల పనిచేసే గూగుల్‌ ఉద్యోగులు సైతం వారి కాంట్రాక్టులకుఅనుగుణంగా బోనస్‌లు, వైద్య బెనిఫిట్స్‌ పొందుతారనాురు. కంపెనీ అత్యధిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రస్తుత ఉద్యోగులు ఉనాురా..? లేదా..? అని తేల్చేందుకు పలు ఉత్పత్తి విభాగాల్లో కఠిన సమీక్ష జరిపామని ఉద్యోగులకు రాసిన లేఖలో పిచారు పేర్కొనాురు. తొలగించిన ఉద్యోగుల్లో కంపెనీలో ఆరు శాతం సిబ్బందికి సమానం. కాగా ఏయే విభాగాల్లో అత్యధికంగా ఉద్యోగులను తొలగించారనే వివరాలను ఆ కంపెనీ ప్రకటించలేదు. 25 ఏళ్ల గూగుల్‌ ప్రస్తుతం సంక్లిష్ట ఆర్థిక వలయాల మీదుగా సాగుతుందని పిచాయ్ తెలిపారు. ఈ క్రమంలోనే వ్యయాల తగ్గింపునపై దృష్టి పెట్టాల్సి వచ్చిందనాురు.

  • స్విగ్గీలో 380 మంది తొలగింపు

గూగుల్‌ బాటలోనే ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ 380 ఉద్యోగులను తొలగించింది. ఉద్వాసనకుగురైన ఉద్యోగులకుశుక్రవారం ఆ కంపెనీ సిఇఒ శ్రీహర్ష మెజెటీ ఇ-మెయిల్‌లో సమాచారం ఇచ్చారు. సంస్థ పునరిుర్మాణ చర్యల్లో భాగంగా అత్యంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనిపేర్కొనాురు. సవాళ్లతో కూడిన స్ధూల ఆర్ధిక పరిస్ధితులే ఈ నిర్ణయానికి దోహదం చేశాయనాురు. ఫుడ్‌ డెలివరీ విభాగంలో వృద్థి రేటు మందగించిందనాురు. లాభాలు సనుగిల్లి రాబడి తగ్గిపోయిందనిపేర్కొనాురు. తొలగించిన ఉద్యోగులకుమద్దతుగా నిలుస్తామని.. మూడు నుంచి ఆరు నెలల్లోగా వారికి నగదు సాయం అందిస్తామనికంపెనీ పేర్కొంది. కంపెనీలో పనిచేసిన కాలం, గ్రేడ్‌ ఆధారంగా ఈ సాయం ఉంటుందనితెలిపింది. తొలగింపునకుగురైన ఉద్యోగులకుమూడు నెలల వేతనం, ఒక్కో ఏడాది సర్వీసుకు15 రోజుల పరిహారంతో పాటు ఎర్‌ుడ్‌ లీవులకుచెల్లింపులు చేస్తామనిపేర్కొంది.