ప్రజాశక్తి-కాకినాడ : విద్యారంగంలో రేషనలైజేషన్ అమలు చేస్తు ప్రభుత్వం ఇచ్చిన జీవో-117వ్యతిరేకిస్తూ గురువారం కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు జి. ప్రభాకర వర్మ మాట్లాడుతూ జీవో -117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతులు విలీనం ఆపాలని, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు కొనసాగించాలని అన్నారు. నూతన విద్యా విధానం రద్దు చేయాలని అన్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. ప్రభాకర వర్మ, ఎస్టీయూ నాయకులు పి.సుబ్బరాజు, ప్రధానోపాధ్యాయులు సంఘ అధ్యక్షుడు సిహెచ్ రవి, పీడీ, పిఈటి ప్రతినిధి లంక జార్జ్, ఏపీ టీఎఫ్ నుంచి కె.సుబ్రహ్మణ్యం, వై.వెంకటరాజు,మోర్త శ్రీనివాస్, కెవి నాగేశ్వరరావు, ఎన్.శివప్రసాద్, పి.అన్నారం, కాశీ విశ్వనాధ్, పండిత పరిషత్ అధ్యక్షుడు పెద్దబ్బాయి, సీపీఎస్ రవిరాజా, ఫిలిప్ రాజు, చింతా నారాయణ మూర్తి, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










