Mar 28,2023 16:49

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : సిల్వర్‌ బెల్స్‌ విద్యార్థిని బాలాంజలి నాట్య నూపుర అవార్డు సాధించిందని పాఠశాల కరస్పాండెంట్‌ ఎంవి.కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పురస్కరించుకొని శ్రీకృష్ణ నటరాజ ఆలయం కల్చరల్‌ డెవలప్మెంట్‌ అకాడమీ, కూచిపూడి కళాక్షేత్రం, తిరుపతి వారు కూచిపూడి నాట్య పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థిని కే. బాలాంజలి కూచిపూడి నత్య ప్రదర్శనకు నాట్యనూపురా అన్న ప్రశంసా పత్రాన్ని, మేమెంటోను అందజేశారన్నారు. ఈ సందర్భంగా బాలాంజలి ఆయన అభినందించి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్‌ లక్కాకుల రాహుల్‌ పాల్గొన్నారు.