ప్రజాశక్తి-అమరావతి : జాతీయ స్థాయి కూచిపూడి నృత్య పోటీలలో తమ విద్యార్థినికి ప్రథమ బహుమతి దక్కిందని శ్రీ చైతన్య స్కూల్ ఓ ప్రకటనలో తెలిపింది. మంగళగిరి బ్రాంచికి చెందిన 8వ తరగతి చదువుతున్న అయ్యపు శ్రీ సౌభాగ్యవల్లి ప్రథమ బహుమతిని సాధించిందని తెలిపింది. గతేడాది నుంచే సాధన ప్రారంభించినప్పటికీ జాతీయ స్థాయి అవార్డును పొందడం విశేషమని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ పేర్కొన్నారు. సౌభగ్యవల్లికి విజయవాడ జోన్ ఇజిఎం మురళీ కృష్ణ, ఆర్‌ఐ రామారావు అభినందనలు తెలిపారు.










